News December 28, 2024
వారికి నెలలోపే కొత్త పెన్షన్

AP: పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. నవంబర్ 1 నుంచి ఈ నెల 15 మధ్య వితంతువులుగా మారిన 5,402 మందికి స్పౌజ్ కేటగిరీలో ఈ నెల 31న రూ.4వేల చొప్పున పంపిణీ చేయనుంది. అలాగే 3 నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని దాదాపు 50వేల మందికి 2, 3 నెలల మొత్తాన్ని ఒకేసారి అందివ్వనుంది. న్యూఇయర్ కానుకగా ఒకరోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 20, 2025
ఆగని పైరసీ.. కొత్తగా ‘ఐబొమ్మ వన్’

ఆన్లైన్లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News November 20, 2025
రైతులకు బాబు వెన్నుపోటు: YCP

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.
News November 20, 2025
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.


