News January 25, 2025
వారికి రూ.4వేల పెన్షన్: మంత్రి సత్యకుమార్

AP: 6నెలల పాటు యాంటిరెట్రో వైరల్ థెరపీ (ART) కేంద్రాల ద్వారా చికిత్స పొందిన HIV బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.4వేల పెన్షన్ అందజేస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో కొన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్(ICTC) వాహనాలను ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందించడం కోసం వీటిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఏపీలో 2.22 లక్షల మంది HIV బాధితులున్నారు.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.