News November 8, 2024
సరిహద్దుల్లో వాళ్లు సైన్యంతో కలిసి పనిచేస్తారు
ఆత్మరక్షణ కోసం ఆ గ్రామాల ప్రజలు తుపాకీ చేతపట్టారు. 1990లో JKలోని దేశ సరిహద్దు గ్రామాల్లోని స్థానికులు, హిందువులు, దుర్భర పరిస్థితుల్లో ఉన్న ముస్లింలు తీవ్రవాదం నుంచి రక్షణ పొందేందుకు విలేజ్ డిఫెన్స్ గార్డుల వ్యవస్థ ఏర్పాటైంది. VDGలు స్థానిక పోలీసులు, బలగాలతో కలిసి పనిచేస్తారు. పాక్ సరిహద్దుల నుంచి చొరబడే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి వీరికి ప్రత్యేకంగా ఆయుధాల వినియోగం, గూఢచర్యంపై శిక్షణ ఇస్తారు.
Similar News
News November 8, 2024
పదో తరగతి పరీక్షల ఫీజు తేదీల ప్రకటన
TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చింది. రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో DEC 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని పేర్కొంది.
News November 8, 2024
త్వరలోనే సినిమా చూపిస్తాం: రేవంత్
TG: బీఆర్ఎస్ నేతలకు ఇవాళ ట్రైలర్ మాత్రమే చూపించామని, త్వరలోనే సినిమా చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. హరీశ్, కేటీఆర్ దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ డిజైన్లు ఖరారవుతాయని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారతారని అన్నారు.
News November 8, 2024
పాకిస్థాన్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్కు వెళ్లేది లేదని పీసీబీకి బీసీసీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా అక్కడికి రాలేమని తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు భారత్ తమ దేశానికి వస్తుందని పాక్ ఊహల్లో విహరించింది. దీనిపై బీసీసీఐ స్పష్టతనివ్వడంతో దుబాయ్లో హైబ్రిడ్ విధానంలో మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.