News February 26, 2025

శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

image

మహాశివరాత్రి కోసం ముస్తాబైన ఆలయం నుంచి శివలింగాన్ని దొంగిలించిన ఘటన గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో జరిగింది. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న పురాతన శివలింగాన్ని నిన్న దొంగలు ఎత్తుకెళ్లారు. లింగం కనిపించకపోవడంతో ఆలయ అధికారులు స్కూబా డైవర్లతో సముద్రంలో గాలిస్తున్నారు. శివరాత్రి ముందు రోజే ఇలా జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 26, 2025

విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు

image

సూడాన్‌లో జరిగిన <<15582145>>విమాన ప్రమాదంలో<<>> మరణాల సంఖ్య పెరిగింది. ఓమ్డర్మన్ నగరంలో జరిగిన ఘటనలో మరణాలు 46కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడినట్లు వెల్లడించారు. పౌర నివాసాలపై విమానం కూలడంతో మిలిటరీ సిబ్బందితో పాటు పౌరులు చనిపోయారని పేర్కొన్నారు. 2023 నుంచి సూడాన్‌లో ఆర్మీకి ర్యాపిడ్ దళాలకు మధ్య యుద్ధం జరుగుతోంది.

News February 26, 2025

తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు!

image

తప్పు చేయకపోయినా చాలా మంది జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అతని పిల్లలు లాయర్లుగా మారారు. యూపీలోని కాన్పూర్‌లో జరిగిన ఓ వివాదంలో అనిల్ గౌర్‌పై తప్పుడు ఆరోపణల కారణంగా అతను 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అతడు నిర్దోషని నిరూపించేందుకు కొడుకు రిషభ్, కూతురు ఉపాసన లా చదివారు. తండ్రి కేసుపై ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేసి విజయం సాధించారు.

News February 26, 2025

రాజౌరీలో ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి

image

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.

error: Content is protected !!