News April 6, 2025
కంచంలో సన్నబియ్యం.. కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా: CM

TG: భద్రాచలం పర్యటనలో భాగంగా సారపాకలో ఓ రేషన్ లబ్ధిదారుడి ఇంట సన్నబియ్యంతో భోజనం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ‘పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం, కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించా’ అంటూ సీఎం రాసుకొచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్ అంటూ హ్యాష్ట్యాగ్లను జతపరిచారు.
Similar News
News April 10, 2025
సిద్ధూ జొన్నలగడ్డ ‘JACK’ రివ్యూ&రేటింగ్

దేశభక్తి ఉన్న హీరో RAWలో చేరేందుకు ఏం చేశాడన్నదే JACK కథ. సిద్ధూ జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. అమ్మతో ఉండే ఎమోషనల్ సీన్లు మెప్పిస్తాయి. కథ, రొటీన్ స్క్రీన్ప్లే, మ్యూజిక్, పాటలు, BGM, సినిమాటోగ్రఫీ నిరాశపరుస్తాయి. స్పై యాక్షన్ మూవీ అయినా థ్రిల్లింగ్ సీన్లు లేకపోవడం మైనస్. సీరియస్గా ఉండాల్సిన చోట్ల కామెడీ, లవ్ ట్రాక్ ప్రేక్షకుడిని ఇబ్బందికి గురిచేస్తాయి. RATING: 2.25/5
News April 10, 2025
IPL2025: వ్యూవర్షిప్లో RCB మ్యాచులు టాప్

ఈ ఏడాది IPL మ్యాచులు అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. 3 దిగ్గజ జట్లు CSK, MI, SRHలు పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగుకు చేరాయి. అయితే, వ్యూవర్షిప్లో మాత్రం RCB ఆడిన ప్రతి మ్యాచుకు JioHotstarలో అత్యధిక వ్యూస్ వచ్చాయి. RCBvsKKR మ్యాచ్కు 41.7 కోట్లు, RCBvsCSKకు 37.4 కోట్లు, RCBvsMIకు 34.7కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. RCB 4 మ్యాచుల్లో 3 గెలిచి టాప్-3లో కొనసాగుతోంది.
News April 10, 2025
నేరుగా తిహార్ జైలుకు తహవూర్ రాణా!

26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా(64)ను అధికారులు US నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొస్తున్నారు. మధ్యాహ్నంలోపు అతడు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడికి రాగానే రాణాను NIA అధికారికంగా అరెస్ట్ చేయనుంది. అనంతరం అతడిని తిహార్ జైలులోని హైసెక్యూరిటీ వార్డులో ఉంచనున్నారు. 2008 NOV 26న ముంబైలోని తాజ్ హోటల్లో 10 మంది పాకిస్థానీ టెర్రరిస్టుల నరమేధం వెనుక రాణాదే మాస్టర్ మైండ్.