News October 24, 2024
రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. ఎప్పుడంటే?

TG: జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్‌లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
డాక్టర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఎంపీపై ఆరోపణలు!

మహారాష్ట్రలో <<18091644>>చేతిపై సూసైడ్ నోట్<<>> రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో 4 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ‘పోలీసు కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. చాలా మందిని వైద్య పరీక్షలకూ తీసుకురాలేదు. ఒప్పుకోలేదని వేధించారు. ఇలానే ఓ ఎంపీ, ఆయన ఇద్దరు సహాయకులు కూడా బెదిరించారు’ అని అందులో పేర్కొన్నారు.
News October 25, 2025
195 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరాట్‌లో 195 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ అప్రెంటిస్‌లు 40, డిప్లొమా అప్రెంటిస్‌లు 20, ట్రేడ్ అప్రెంటిస్(ITI) 135 ఉన్నాయి. ITI, డిప్లొమా, ఇంజినీరింగ్‌లో కనీసం 70% మార్కులతో పాసై ఉండాలి. వయసు 18ఏళ్లు నిండి ఉండాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 46

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరేంటి?
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ఏది?
3. నాగుల చవితి ఏ మాసంలో వస్తుంది?
4. ఇంద్రుడికి గురువు ఎవరు?
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ఎవరు?
✍️ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


