News January 23, 2025

మూడో తరగతి విద్యార్థి ఫీజు రూ.2.1 లక్షలు

image

చదువును కొందరు బిజినెస్‌గా మార్చేశారని విమర్శలొస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెమటోడుస్తున్న తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో కొన్ని స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్కూల్‌లో మూడో తరగతి ఫీజు షాక్‌కి గురిచేస్తోంది. పిల్లాడి చదువుకోసం ఏడాదికి రూ.2.1 లక్షలు చెల్లించాలా? అంటూ సీఎం సిద్ద రామయ్యను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Similar News

News November 21, 2025

సీఎం మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ క్లారిటీ

image

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి Dy.CM డీకే శివకుమార్ తెరదించారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తానూ సహకరిస్తానన్నారు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. ‘అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ MLAలు ఢిల్లీకి వచ్చారు’ అని తెలిపారు.

News November 21, 2025

ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. పిండిమరతో బాంబుల తయారీ!

image

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో అరెస్టైన పుల్వామాకు చెందిన ముజమ్మిల్ షకీల్ గనై కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను బాంబుల తయారీకి పిండిమరతో కెమికల్స్‌ను తయారు చేసినట్లు NDTV పేర్కొంది. ఫరీదాబాద్‌లోని తన రూమ్‌ను ఇందుకు వాడుకున్నాడని తెలిసింది. NOV 9న పోలీసులు ఇతని రూమ్‌లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియాని పిండిమరలో వేసి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసినట్లు సమాచారం.

News November 21, 2025

జక్కన్నపై దేవుడికి లేని కోపం మీకెందుకు: RGV

image

నాస్తికుడిగా ఉండటం నేరం కాదని రాజమౌళిపై విషం చిమ్మేవారు తెలుసుకోవాలని RGV పేర్కొన్నారు. ‘దేవుణ్ని నమ్మనివాడు ఆయనపై మూవీ తీయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ మూవీ తీయాలంటే డైరెక్టర్ గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? నిజమేంటంటే నమ్మని వ్యక్తికే దేవుడు వందరెట్లెక్కువ సక్సెస్ ఇచ్చాడు. అంటే దేవుడు మీ కంటే నాస్తికులనే ఎక్కువ ప్రేమిస్తుండాలి. మరి రాజమౌళితో దేవుడికిలేని ఇబ్బంది మీకెందుకు’ అని ట్వీట్ చేశారు.