News April 1, 2024
ముంబైకి మూడో ఓటమి

ముంబై వరుసగా మూడో మ్యాచులోనూ ఓడిపోయింది. తొలి 2 మ్యాచులు ఇతర వేదికల్లో జరగ్గా.. ఇవాళ సొంతగడ్డపైనా సత్తా చాటలేకపోయింది. బ్యాటర్లు విఫలం కావడంతో మూడో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత ముంబై 125 రన్స్ చేయగా.. రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 27 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. RR యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (54*) తన జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ 3 వికెట్లు తీశారు.
Similar News
News January 27, 2026
కవిత కొత్త పార్టీ పేరు ఇదేనా?

TG: సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించిన కవిత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలపై ఆమె ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘తెలంగాణా ప్రజా జాగృతి’ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తనకు సెంటిమెంట్‌గా ఉన్న జాగృతి పేరును పార్టీ పేరులో కొనసాగించాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది నాటికి పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది.
News January 27, 2026
ఇండియన్ మార్కెట్లోకి ‘డస్టర్’ రీఎంట్రీ

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ తన ‘డస్టర్’ కారును మరోసారి మార్కెట్లోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఒకప్పుడు పాపులరైన ఈ కార్ల ఉత్పత్తి 2022లో నిలిచిపోయింది. అయితే చెన్నైలోని తయారీ ప్లాంట్‌ను పూర్తిగా సొంతం చేసుకున్న కంపెనీ డస్టర్‌తో రీఎంట్రీ ఇచ్చింది. దీంతో టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌తో డస్టర్ పోటీ పడనుంది.
News January 27, 2026
USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి

అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మంది అంధకారంలో ఉన్నారు. పలు ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 15కుపైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనగా రవాణా స్తంభించిపోయింది. మంచు తుఫాన్ ప్రభావంతో సుమారు 17వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


