News November 11, 2024
18 నుంచి ‘అగ్రి’ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్
TG: అగ్రికల్చర్, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 నుంచి మూడో దశ కౌన్సెలింగ్ జరగనుంది. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పెషల్ కోటా, రెగ్యులర్ కోటాలో 213 ఖాళీలు ఏర్పడినట్టు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు. పూర్తి వివరాల కోసం www.pjtau.edu.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. మెరిట్ ఆధారంగానే సీట్ల భర్తీ ఉంటుందని, దళారుల మాటలు నమ్మొద్దని సూచించారు.
Similar News
News November 13, 2024
పోలీసులకు అంబటి సవాల్.. ఆ తర్వాత
AP: హోంమంత్రి అనితపై అసభ్య పోస్టులు పెట్టిన YCP కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో కేసు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాజశేఖర్ తమ ఆఫీస్లోనే ఉన్నాడని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని అంబటి సవాల్ విసరడంతో పోలీసులు నేరుగా వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.
News November 13, 2024
అధికారులపై దాడి ఘటనలో BRS శక్తులు: సీఎం సోదరుడు
CM పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకే కేటీఆర్ అధికారులపై దాడులు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. వికారాబాద్(D) లగచర్లలో అధికారులపై దాడి వెనుక BRS శక్తులు పని చేశాయని ఆరోపించారు. తాము హరీశ్ రావు లాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేయించి రైతులను కొట్టలేదని వ్యాఖ్యానించారు. నిందితులు ఎంతటి వారైనా పోలీసులు అరెస్టు చేసి తీరుతారని స్పష్టంచేశారు.
News November 13, 2024
కోహ్లీని కించపరచడం నా ఉద్దేశం కాదు: పాంటింగ్
విరాట్ ఐదేళ్లలో రెండే టెస్టు సెంచరీలు చేశారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ వివరణ ఇచ్చారు. ‘విరాట్ను కించపరచడం నా ఉద్దేశం కాదు. AUSతో BGT సమయానికి ఫామ్ అందుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పాను. ఈ విషయంలో కోహ్లీ కూడా నాతో ఏకీభవిస్తారు. తను ఆస్ట్రేలియాలో పుంజుకుంటారని కూడా నేను అన్నాను. కానీ నా మాటలు వక్రీకరించి ప్రచారమయ్యాయి ’ అని వ్యాఖ్యానించారు.