News April 29, 2024
మూడో దశ పోలింగ్.. 244 మందిపై క్రిమినల్ కేసులు

లోక్సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ జరగనున్న 95 స్థానాల్లో 1352 మంది బరిలో ఉన్నారు. ఇందులో 123 మంది మహిళలు పోటీలో నిలిచారు. మొత్తంగా 244 మంది(18శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. 172 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు, ఐదుగురిపై హత్య, 38 మందిపై అత్యాచారం కేసులున్నాయి. కాగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే 7న పోలింగ్ జరగనుంది.
Similar News
News November 29, 2025
MBNR: ఓపెన్ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

MBNR జిల్లాలో డా. బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ స్టడీ విధానంలో పీజీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన పీజీ స్పెల్-2 సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 జనవరి 20 నుంచి జనవరి 31 వరకు జరుగుతాయని, పరీక్షా రుసుమును www.braouonline.in లో డిసెంబర్ 22 వరకు చెల్లించాలని రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
News November 29, 2025
అమలాపురం: ఎంపీ హరీశ్కు జీవన సాఫల్య పురస్కారం

అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ గౌరవ్ అవార్డు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీకి ఈ అవార్డును అందజేశారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందని, అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ హరీశ్ తెలిపారు.