News July 10, 2024

మూడో టీ20.. భారత్ స్కోర్ 182/4

image

జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 182/4 స్కోర్ చేసింది. గిల్ 66, రుతురాజ్ గైక్వాడ్ 49, జైస్వాల్ 36, అభిషేక్ శర్మ 10, శాంసన్ 12* రన్స్ చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజర్‌బానీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే ZIM 20 ఓవర్లలో 183 రన్స్ చేయాలి.

Similar News

News January 11, 2026

చైనా, అమెరికాకు సాధ్యం కానిది ఇండియా సాధించింది: చంద్రబాబు

image

AP: బెంగళూరు-కడప-విజయవాడ కొత్త నేషనల్ హైవే వారం రోజుల వ్యవధిలోనే 4 గిన్నిస్ రికార్డులను సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీటుతో 156 లేన్ కి.మీ రహదారి నిర్మించారని కాంట్రాక్ట్ కంపెనీ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకన్ లిమిటెడ్, NHAIను అభినందించారు. కొత్త రోడ్ల నిర్మాణంలో అమెరికా, చైనా, జర్మనీకి సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం చేసిందని ట్వీట్ చేశారు.

News January 11, 2026

లేట్ కాకముందే డీల్ చేసుకోండి.. క్యూబాకు ట్రంప్ హెచ్చరిక

image

క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. ‘ఇకపై క్యూబాకు ఆయిల్ లేదా డబ్బు వెళ్లదు. ఆలస్యం కాకముందే డీల్ చేసుకోవాలని సూచిస్తున్నా. వెనిజులా నుంచి వస్తున్న ఆయిల్, డబ్బుతో చాలా ఏళ్లు క్యూబా బతికింది. అందుకు బదులుగా వెనిజులాకు సెక్యూరిటీ సర్వీసెస్ అందించింది. ఇకపై అలా జరగబోదు’ అని ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.

News January 11, 2026

కోహ్లీ సెంచరీ మిస్

image

స్టార్ క్రికెటర్ కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి ఔటయ్యారు. జెమీసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో కింగ్ నుంచి మరో సెంచరీ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 234/3. టీమ్ ఇండియా విజయానికి 64 బంతుల్లో 67 రన్స్ అవసరం.