News November 13, 2024
మూడో టీ20: భారత్ స్కోర్ 219/6

సౌతాఫ్రికాతో మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 219/6 స్కోర్ చేసింది. తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, సిమెలనే 2 వికెట్లు తీయగా, జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే SA 20 ఓవర్లలో 220 రన్స్ చేయాలి.
Similar News
News December 6, 2025
NZB: జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ ఎంపికలు

నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం నగరంలోని రాజారాం స్టేడియంలో జరిగాయి. ఈ ఎంపికలో రాష్ట్ర స్థాయికి 70 మీటర్ల పురుషుల విభాగంలో N.రవీందర్ (గోల్డ్), N.రుత్విక్ (సిల్వర్), A.నవీన్ (బ్రాంజ్), ఇండియన్ రౌండ్లో బాయ్స్ విభాగంలో M.శ్రీధర్ (గోల్డ్), N.రాజేందర్ (సిల్వర్), SK రెహన్ (బ్రాంజ్) ఎంపికయ్యారని అర్చరీ కోచ్ రవీందర్ తెలిపారు.
News December 6, 2025
‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్లైన్ కంటెంట్ రూల్స్ను మస్క్ ప్లాట్ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.
News December 6, 2025
డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం


