News September 9, 2025
తమిళనాడు నుంచి మూడో ఉపరాష్ట్రపతి

దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.
Similar News
News September 10, 2025
శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
News September 10, 2025
ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలు ఇవే

ఐఫోన్ <<17663695>>17 సిరీస్<<>> మోడల్ ఫోన్లు ఈ నెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో వీటి ప్రారంభ ధరలు (256gb) ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 17: ₹82,900
ఐఫోన్ 17 ఎయిర్: ₹1,19,900
ఐఫోన్ 17 ప్రో: ₹1,34,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్: ₹1,49,900
News September 10, 2025
ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్!

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘ఐఫోన్ ఎయిర్’ పేరిట అత్యంత సన్నగా ఉండే మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది 6.5 ఇంచ్ ప్రో మోషన్ డిస్‌ప్లేతో వస్తుంది. అటు ఐఫోన్ 17లో 6.3inch డిస్‌ప్లే, 120hz రిఫ్రెష్ రేట్, 3NM A19 సిలికాన్ చిప్ ఉంటాయి. అన్ని మోడల్స్‌లో ఇంటర్నల్ బేస్ స్టోరేజ్ 256GBగా ఉంది. 17 ప్రో, ప్రో మాక్స్‌లో 48MP ట్రిపుల్ కెమెరా, A19 ప్రో చిప్ వంటి ఫీచర్లున్నాయి. వివరాలకు ఇక్కడ <