News November 22, 2024
మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ సైన్యాధికారి
మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందని, రష్యా మిత్రదేశాలు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొనడమే నిదర్శనమని ఉక్రెయిన్ Ex సైన్యాధికారి వలెరీ జలుఝ్నీ అన్నారు. ఉత్తర కొరియా బలగాలు, ఇరాన్ ఆయుధాలను ప్రయోగించి అమాయకులను రష్యా హతమార్చడం 3వ ప్రపంచ యుద్ధానికి సాక్ష్యమన్నారు. నిర్ణయాత్మక చర్యల ద్వారా యుద్ధాన్ని ఇరు దేశాలకే పరిమితం చేయాలని ఉక్రెయిన్ మిత్రపక్షాలను వలెరీ కోరారు.
Similar News
News November 22, 2024
చెట్లు నరికేయకుండా కర్ర వాడుకోవచ్చు!
పచ్చదనాన్ని పరిరక్షించేందుకు జపాన్ ప్రభుత్వం పాటిస్తోన్న పద్ధతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అక్కడ చెట్లను నరకకుండానే కలపను పొందుతుంటారు. అది ఎలా అనుకుంటున్నారా? దైసుగి అనే పురాతన ప్రక్రియలో ఉత్తమమైన దేవదారు వృక్షాలను ఎంపిక చేస్తారు. పొడవుగా పెరిగేందుకు పైన కొమ్మలను కట్ చేస్తుంటారు. ఏపుగా పెరిగిన వృక్షాలను పైనుంచి కత్తిరించి చెక్కను వాడుకుంటారు.
News November 22, 2024
అదానీ లంచాల వ్యవహారం: స్పందించిన తమిళ సర్కారు
Adani Groupతో తమకు ఎలాంటి ప్రత్యక్ష బంధాలు లేవని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECIతో 2021లో యూనిట్ ₹2.61తో 1,500MW Solar Power 25 ఏళ్లపాటు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి సెంథిల్ తెలిపారు. అవినీతిమయమైన గ్రూప్‌ను BJP ఎందుకు సమర్థిస్తోందని DMK ప్రతినిధి శరవణన్ ప్రశ్నించారు. అదానీపై విచారణ జరిపించే దమ్ముందా అని BJPకి సవాల్ విసిరారు.
News November 22, 2024
మమ్మల్ని రెచ్చగొట్టకండి: రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌కు సాయం చేయడం మానుకోవాలని పశ్చిమ దేశాలకు రష్యా తాజాగా సూచించింది. తమను రెచ్చగొట్టొద్దని పేర్కొంది. ‘మా గడ్డపై జరిగే దాడుల్లో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకోవద్దు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయొద్దు. మీ వైఖరి ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్‌పై మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం’ అని హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో జనావాసాల మీదకు రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.