News September 22, 2024

ఈ పురస్కారం తెలుగువారికి మరింత గర్వకారణం : CBN

image

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన గ్రేస్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి చేశారని ట్వీట్ చేశారు. ఇది చిరంజీవికి గుర్తింపును పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మరింత గర్వకారణమని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<>STPI<<>>) 24 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 12వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ స్టాఫ్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech, MSc, M.Tech, PhD, డిప్లొమా, టెన్త్+ITI, ఇంటర్, డిగ్రీ, PG, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: stpi.in

News December 2, 2025

NDAలోకి విజయ్ దళపతి?

image

తమిళనాడులో NDA కూటమిలోకి TVK చీఫ్ విజయ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉండొచ్చని అన్నాడీఎంకే చీఫ్ <<17963359>>పళనిస్వామి <<>>గతంలో సంకేతాలిచ్చారు. అయితే కూటమిలో చేరుతున్నామనే వార్తలను TVK ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కూటమిగా వెళ్తేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.

News December 2, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్