News June 4, 2024
ఈ ఎన్నికలు ఓ రికార్డు
2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం 7 దశల్లో 44 రోజులపాటు సాగి కొత్త రికార్డు నమోదు చేసింది. అదే, 1996లో 11 రోజులు, 1998లో 8 రోజులు, 1999లో 28 రోజులు, 2004లో 21 రోజులు, 2009లో 28 రోజులు, 2014లో 36 రోజులు, 2019లో 39 రోజులపాటు ఎన్నికల ప్రక్రియ సాగింది. ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా నిర్వహిస్తుండడంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తిన విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2025
దావోస్‌లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.
News January 22, 2025
విజయ పరంపర కొనసాగుతుందా?
ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 4 టీ20 సిరీస్‌లలో ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ కూడా గెలుపొంది వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా మూడు సార్లు గెలిస్తే రోహిత్ సారథ్యంలో ఇండియా ఒకసారి గెలిచింది.
News January 22, 2025
పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు
పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 22 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 12-30 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. శాంపిల్స్‌ను టెస్టుల కోసం ICMR-NIVకి పంపామన్నారు. కలుషితమైన నీరు/ఆహారం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నాడీ సంబంధిత వ్యాధి సాధారణంగా వైరల్/బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ఛాన్సుందని డాక్టర్లు చెబుతున్నారు.