News March 16, 2024
లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 1/2

ఎన్నికల నగారా మోగింది. బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగమైన లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. సీపీఐ-3, సీపీఎం-2తో గత ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితమైన లెఫ్ట్ పార్టీల ఉనికి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. ఈసారి తేడా వస్తే అది కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
Similar News
News November 24, 2025
పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 24, 2025
భారత్కు మరో ఓటమి తప్పదా?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.


