News September 12, 2025
టీనేజ్ అమ్మాయిలకు ఈ ఆహారం బెస్ట్

టీనేజ్ అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా పలు మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రభావాన్ని తగ్గించాలంటే వారి డైట్‌లో అవిసె గింజలు చేర్చాలి. ఇందులోని కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సి, ఇ, కె విటమిన్లు హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి. రక్తహీనత రాకుండా అంజీర్, శక్తిని పెంచడానికి బీన్స్, పప్పులు, చేపలు, నిమ్మజాతి పండ్లు ఇవ్వాలని సూచిస్తున్నారు.
Similar News
News March 17, 2026
మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.
News March 17, 2026
24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్

వినియోగదారులకు వేగవంతమైన డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్ పోస్ట్’, ‘48 స్పీడ్ పోస్ట్’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. తొలిదశలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సదుపాయం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. వస్తువులు పోస్టు చేసిన మరుసటి రోజే డెలివరీ అవ్వకపోతే పేమెంట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. OTPతో డెలివరీ తీసుకోవచ్చు.
News March 17, 2026
మత మార్పిడులపై ఉక్కుపాదం.. కీలక బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

బలవంతం, మోసం, ప్రలోభం, వివాహాల ద్వారా జరిగే మత మార్పిడులను నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్-2026కు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తారు. మైనర్, SC, ST, మహిళలు, రోగులతోపాటు సామూహిక మత మార్పిడులకు పాల్పడితే అదనంగా రూ.5 లక్షలు ఫైన్ ఉంటుంది. పదేపదే ఇవే నేరాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధిస్తారు.


