News April 10, 2024
ఈ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి: పవన్ కళ్యాణ్

AP: రైతులను ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తణుకు సభలో మాట్లాడిన ఆయన.. ‘ధాన్యం తడిచిందని మంత్రికి చెబితే చీత్కారంగా మాట్లాడారు. బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు YCP కేబినెట్లో ఉన్నారు. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు? ఇక్కడ దోచుకున్న సొమ్ముతో మరోచోట పరిశ్రమలు పెడుతున్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో డబ్బులు దోచుకున్నారు’ అని ఆరోపించారు.
Similar News
News December 1, 2025
TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.
News December 1, 2025
డేటింగ్ వార్తలపై మృణాల్ క్లారిటీ

హీరో ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ <<18371019>>డేటింగ్<<>> వార్తలు కొన్ని నెలలుగా వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. వీటిపై మృణాల్ పరోక్షంగా స్పందించారు. ‘ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. రూమర్ల వల్ల ఉచితంగా నాకు PR జరుగుతోంది. ఇలాంటి ఫ్రీ స్టఫ్ నాకు ఇష్టం’ అని చెప్పారు. తాము మిత్రులమంటూ ధనుష్‌తో డేటింగ్ వార్తలను గతంలో ఆమె కొట్టిపారేశారు.
News December 1, 2025
త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ: మంత్రి దుర్గేశ్

సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా APని నిలుపుతామని మంత్రి దుర్గేశ్ అన్నారు. ‘త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తాం. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహం కల్పిస్తాం. కలిసి పనిచేసి తెలుగు సినీ పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం. నంది అవార్డుల ప్రదానోత్సవం, నాటకోత్సవాలను త్వరలోనే నిర్వహిస్తాం’ అని ముంబైలో ‘CII బిగ్ పిక్చర్ సమ్మిట్’లో వెల్లడించారు.


