News November 25, 2024
ఈ హెడ్ ఎప్పుడూ మనకు ‘హెడే’కే..

భారత్‌తో ఆట అంటే చాలు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు పూనకం వస్తుంది. కీలక మ్యాచుల్లో రాణించి మనకు ట్రోఫీలను అందకుండా చేశారు. తాజాగా BGT తొలి టెస్టులోనూ హాఫ్ సెంచరీ చేశారు. INDపై WTC ఫైనల్లో, వన్డే WC ఫైనల్లో సెంచరీలు చేసి మనకు కప్పులు దూరం చేశారు. ఈ ఏడాది జరిగిన T20 WCలో ఫిఫ్టీ చేశారు.
Similar News
News December 4, 2025
వనపర్తి: 45 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు బుధవారం మొత్తం 45 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావిలోని 17 GPలకు – 9 నామినేషన్లు.
✓ పానగల్‌లోని 28 GPలకు – 15 నామినేషన్లు.
✓ పెబ్బేరులోని 20 GPలకు – 13 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్‌లోని 8 GPలకు – 6 నామినేషన్లు.
✓ వీపనగండ్లలోని 14 GPలకు – 2 నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 4, 2025
పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.
News December 4, 2025
హనీమూన్ వెకేషన్‌లో సమంత-రాజ్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.


