News March 23, 2024

ఈ హోలీ చాలా హాట్ గురూ!

image

గతంతో పోలిస్తే ఈసారి హోలీ పండగకు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1970 నుంచి ఏటా మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. మార్చి ఆఖరులో భానుడి భగభగలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. మార్చి ఆఖరి వారంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటే ఛాన్స్ 1970ల్లో ఒక్క మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లోనే ఉండేదట. ఇప్పుడు ఈ జాబితాలో AP, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు చేరాయట.

Similar News

News July 8, 2024

డీఎస్సీ పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన

image

TG: డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తుండగా.. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ స్పందించింది. DSC పరీక్షలు <<13528813>>యథాతథంగా<<>> నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

News July 8, 2024

BREAKING: JL ఫలితాలు విడుదల

image

TG: జూనియర్ లెక్చరర్స్ పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్‌సైటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ జాబితాను త్వరలోనే వెల్లడిస్తామంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తామంది. కాగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే జేఎల్ పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 8, 2024

భూమన, ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు

image

AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఎస్ నీరభ్ కుమార్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.