News October 19, 2024
ఈ భారత జట్టుకు పోరాడే లక్షణం ఎక్కువ: మంజ్రేకర్

బెంగళూరు టెస్టు విషయంలో న్యూజిలాండ్‌ను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు. భారత జట్టుపై గెలవడం అంత సులువు కాదని తేల్చిచెప్పారు. ‘ఇప్పుడున్న భారత జట్టుకు పోరాడే లక్షణం ఎక్కువ. నేను న్యూజిలాండ్ ఆటగాడినైతే కచ్చితంగా టీమ్ ఇండియాను చూసి భయపడతా. వరల్డ్ కప్ టీ20 ఫైనల్స్‌లో సౌతాఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులే కావాలి. అయినా సరే భారత్ ఎలా గెలిచిందో చూశాం కదా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 20, 2026
‘అబూ సలేం పారిపోతాడు’.. పెరోల్‌పై ప్రభుత్వం అభ్యంతరం

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం పెరోల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. సోదరుడి మరణం నేపథ్యంలో పెరోల్ కోసం అప్లై చేయగా, 14 రోజులు ఇస్తే అబూ సలేం పారిపోయే ప్రమాదం ఉందని MH ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అత్యవసరమైతే 2 రోజులు మాత్రమే పెరోల్ ఇవ్వొచ్చని సూచించింది. కాగా గతంలో సలేం పోర్చుగల్‌కు పారిపోగా అక్కడి నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.
News January 20, 2026
టెన్త్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్‌ను MAR 16-APR 1 వరకు నిర్వహిస్తామని SSC బోర్డు 2025 NOVలో వెల్లడించింది. MAR 20న ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. అయితే ఆ రోజు రంజాన్ కావడంతో GOVT సెలవు ప్రకటించింది. దీంతో పరీక్షను MAR 21న జరిపే ఛాన్స్ ఉంది. కాగా కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ‘Way2News’కి తెలిపారు.
News January 20, 2026
దావోస్‌లో సీఎం టీమ్.. టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్

TG CM రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన బృందం దావోస్‌లో పెట్టుబడుల వేట మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీని వరల్డ్ క్లాస్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు UAE ప్రభుత్వంతో చేతులు కలిపింది. అటు ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీలు రాష్ట్రంలో ఏఐ సంబంధిత పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకరించాయి.


