News November 13, 2024

ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్: జగన్

image

AP:పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు బయటకొస్తాయనే భయంతోనే ఇన్ని నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో ఆమేరకు నిధులు కేటాయించేవారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది’ అని మండిపడ్డారు.

Similar News

News February 7, 2026

మన పొరుగు వారి కంటే మేలు: పీయూష్ గోయల్

image

అమెరికాతో చేసుకున్న <<19072293>>వాణిజ్య ఒప్పందం<<>> వల్ల రైతులకు, చేతివృత్తుల వారికి ఎలాంటి హాని కలగదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘మనపై విధించిన 18% టారిఫ్స్ పొరుగు వారి కంటే తక్కువే. చైనా 35%, వియత్నాం 20%, బంగ్లాదేశ్ 20%, ఇండోనేషియా 19% సుంకాలు ఎదుర్కొంటున్నాయి. తాజా ఒప్పందంతో ఎన్నో వస్తువులను ఎలాంటి టారిఫ్ కట్టకుండానే అమెరికాకు ఎగుమతి చేయొచ్చు’ అని తెలిపారు.

News February 7, 2026

పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

image

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.

News February 7, 2026

అన్ని US పారిశ్రామిక వస్తువులపై భారత్ జీరో డ్యూటీ: పీయూష్ గోయల్

image

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై ఏడాదిపాటు చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత జెమ్స్ అండ్ జువెలరీపై జీరో టారిఫ్స్ వర్తిస్తాయని తెలిపారు. ఏడాదికి $500 బిలియన్ల వాణిజ్యం టార్గెట్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సుంకాలను మరింత తగ్గించే విషయంపై చర్చిస్తున్నామన్నారు. USకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై భారత్ సున్నా సుంకాలు విధిస్తుందని వెల్లడించారు.