News October 9, 2025

ఇది కాంగ్రెస్ డ్రామా: హరీశ్ రావు

image

TG: ఆరు గ్యారంటీల్లాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లూ కాంగ్రెస్ డ్రామా అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీల కోసం పనిచేసిందా? చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ నేతలతో ఢిల్లీ వేదికగా కొట్లాడాలి. కలిసి వచ్చేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేసిన కుట్రలు విఫలం అయ్యాయి’ అని విమర్శించారు.

Similar News

News October 9, 2025

ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

image

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌‌‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

News October 9, 2025

ట్రంప్ మెడలో నోబెల్ మెడల్.. AI ఇమేజ్ షేర్ చేసిన నెతన్యాహు

image

US ప్రెసిడెంట్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇజ్రాయెల్ PM నెతన్యాహు సూచించారు. అందుకు ఆయన అర్హుడని, ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్, బందీల విడుదలకు ఎంతో కృషి చేశారని ఆకాశానికెత్తారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒకరోజు ముందు నెతన్యాహు తన స్నేహితుడి(ట్రంప్) కోసం ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ట్రంప్ నోబెల్ మెడల్ మెడలో వేసుకోగా నెతన్యాహు సహా మరికొందరు చప్పట్లు కొడుతున్న AI ఇమేజ్‌ను షేర్ చేశారు.

News October 9, 2025

కోటరీ లబ్ధికే PPP పేరిట మెడికల్ కాలేజీల పందేరం: సజ్జల

image

తన సొంత కోటరీకి లబ్ధి కలిగేలా CBN PPP పేరుతో మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 నిర్మాణాలు పూర్తిచేస్తే, అందులో 5 CM ప్రైవేటుకు అప్పగించేశారని విమర్శించారు. పేదలకు అన్యాయం చేస్తున్న ఆయన చర్యలను తమ పార్టీ ప్రతిఘటిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని పోస్టర్‌ను రిలీజ్ చేశారు.