News July 27, 2024

ఇది కాస్ట్లీ ఫైర్ ఆపరేషన్ గురూ.. టీ, ఫుడ్‌కే రూ.27 లక్షలు!

image

తమిళనాడు వెల్లలూరులోని డంపింగ్ యార్డులో ఎండల ధాటికి ఎగిసిన మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ఆపరేషన్‌కు రూ.76.70 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో సిబ్బంది టీ, ఆహారం కోసమే రూ.27.52 లక్షలు ఖర్చు అయిందట. ఈ బిల్లులకు ఇటీవల కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. ‘ఏప్రిల్ 6న డంపింగ్ యార్డు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. 12 రోజుల పాటు 600 మంది షిఫ్టుల వారీగా ఆపరేషన్‌లో పాల్గొన్నారు’ అని వెల్లడించింది.

Similar News

News January 24, 2026

ప్రియాంక చోప్రాకు మహేశ్ బాబు ప్రశంసలు

image

హీరోయిన్ ప్రియాంక చోప్రాను ప్రశంసిస్తూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఆమె లీడ్ రోల్ చేసిన ‘The Bluff’ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజైంది. యాక్షన్ ట్రైలర్‌లో ప్రియాంక అద్భుతంగా నటించారని పొగిడారు. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

News January 24, 2026

ప్రైస్‌తో పనిలేదు.. కొంటూనే ఉంటా: బంగారం, వెండిపై రాబర్ట్ కియోసాకి

image

బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పెరిగినా, తగ్గినా తనకు అనవసరమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి చెప్పారు. ప్రభుత్వాలు అప్పులు పెంచుకుంటూ పోవడం వల్ల కరెన్సీ విలువ పడిపోతోందని, పేపర్ మనీ కంటే ఈ ‘రియల్ అసెట్స్’ వైపే మొగ్గు చూపుతానని వివరించారు. పాలసీ మేకర్ల నిర్ణయాల వల్ల మార్కెట్‌లో అనిశ్చితి ఉంటే షార్ట్ టర్మ్ ధరల గురించి టెన్షన్ పడకుండా సంపదను పోగు చేసుకోవడమే తెలివైన పని అని వివరించారు.

News January 24, 2026

ఉపవాసంతో వృద్ధాప్యం దూరం

image

ఉపవాసం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. ఉపవాసం శరీరంలోని కణాలను రిపేర్ చేయడంతో పాటు, నిద్ర, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే BP, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యఛాయలను దూరం చెయ్యడంలో ఉపవాసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు సిర్టుయిన్స్ ఉత్పత్తై వృద్ధాప్య ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేస్తాయంటున్నారు.