News October 14, 2025

ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

image

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 14, 2025

‘ఇది ఆల్‌టైమ్ చెత్త ఫొటో’.. ట్రంప్ సెల్ఫ్ ట్రోలింగ్

image

టైమ్ మ్యాగజైన్ కవర్‌ పేజీపై ప్రచురించిన తన ఫొటో చెత్తగా ఉందంటూ US ప్రెసిడెంట్ ట్రంప్ సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నారు. ‘నా గురించి మంచి కథనం రాశారు. కానీ ఫొటో మాత్రం వరస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్. నా జుట్టు కనిపించకుండా చేశారు. తలపై ఏదో చిన్న కిరీటం ఎగురుతున్నట్టు పెట్టారు. భయంకరంగా ఉంది. కింది నుంచి తీసే ఫొటోలు నాకిష్టం ఉండవు. ఇది సూపర్ బ్యాడ్ పిక్చర్. ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని అసహనం వ్యక్తం చేశారు.

News October 14, 2025

ఏపీ రౌండప్

image

* ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల బదిలీ.. గుజరాత్ HC నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ నుంచి జస్టిస్ డూండి రమేశ్, కోల్‌కతా నుంచి జస్టిస్ సుబేందు సమంత బదిలీ
* వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు మినీ రత్న హోదా
* కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ అంతార్ సింగ్ ఆర్యకు YCP నేతల ఫిర్యాదు
* విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్ టెండర్ల గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు

News October 14, 2025

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు సర్కార్.. గురు/శుక్రవారం విచారణ!

image

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రిజర్వేషన్ల GOను కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలివ్వగా, దానిపై SLPని దాఖలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాది సుప్రీం రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేశారు. CJI అనుమతితో లిస్ట్ చేస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.