News July 1, 2024

ఇది ప్రజా ప్రభుత్వం.. కష్టపడి పనిచేస్తాం: చంద్రబాబు

image

AP: CMగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడో సంతకం పెట్టినట్లు చంద్రబాబు పెనుమాక సభలో వెల్లడించారు. ‘వీటిల్లో రూ.5కే భోజనం చేయవచ్చు. త్వరలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన కోసం శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. నిరంతరం కష్టపడి పనిచేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించాలి’ అని కోరారు.

Similar News

News July 3, 2024

మహేశ్ మూవీలో విలన్‌గా మలయాళ హీరో?

image

మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

News July 3, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

TG: రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్‌టాప్‌లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్‌టాప్‌లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

News July 3, 2024

ఫొటో తీసి రూ.20వేలు గెలిచే ఛాన్స్!

image

AUG19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉత్తమ వార్తా చిత్రం(న్యూస్ క్లిప్) విభాగాల్లో ఫొటోలు తీయాలి. మొదటి ముగ్గురికి రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, తర్వాత ఐదుగురికి ప్రోత్సాహకంగా రూ.5వేలు ఇస్తుంది. ఫొటోలను adphoto.ts@gmail.coకి పంపాలి. మరిన్ని వివరాలకు 9949351523కి ఫోన్ చేయవచ్చు.