News April 3, 2025
ఇది HCU విద్యార్థుల విజయం: KTR

TG: కంచ గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి KTR ధన్యవాదాలు తెలిపారు. ఇది అవిశ్రాంతంగా పోరాడిన HCU విద్యార్థుల విజయమని అభివర్ణించారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు, పర్యావరణ ప్రేమికులు, మీడియా, సోషల్ మీడియా మిత్రులకు థాంక్స్ చెప్పారు. మరోవైపు SC ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని BJP MP రఘునందన్‌రావు పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైందని APSDMA అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో అది గంటకు 6 కి.మీ వేగంతో కదిలిందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News October 26, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీలోని ఎయిమ్స్ మంగళగిరి 10 వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం 10రోజుల్లోగా దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను స్పీడ్ పోస్ట్ చేయాలి. కన్సల్టెంట్, సీనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్, బయో మెడికల్ ఇంజినీర్, శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: aiimsmangalagiri.edu.in
News October 26, 2025
గ్యాస్ గీజర్లు వాడుతున్నారా?

కర్ణాటకలోని బెట్టపురలో బాత్రూమ్లో గీజర్ నుంచి లీకైన LPG గ్యాస్ పీల్చడంతో అక్కాచెల్లెళ్లు గుల్ఫామ్, తాజ్ చనిపోయారు. అలాంటి గీజర్లు వాడే వారికి ఈ ఘటన ఒక వేకప్ కాల్ అని నిపుణులు అంటున్నారు. మీరు గ్యాస్ గీజర్లు వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ‘యూనిట్‌ను బాత్రూమ్లో కాకుండా బయటి ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేయించాలి. తరచూ గ్యాస్ లీకేజీలను చెక్ చేయాలి. వాడనప్పుడు ఆఫ్ చేయాలి’ అని సూచిస్తున్నారు.


