News December 16, 2024
ఇది అరాచక ప్రభుత్వం: KTR

TG: భూములు ఇవ్వని రైతులను అరెస్ట్ చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినవారినీ జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా సీఎం రేవంత్ పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్నది అరాచక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన KCR ఉన్నారని, BRS వారి తరఫున పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 23, 2025
అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: ద.అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని IMD వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఈనెల 30 నాటికి తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉందని, NOV 28 నుంచి వర్షాలు పెరుగుతాయని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.
News November 23, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News November 23, 2025
దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమా?

దీపంలో వత్తి పూర్తిగా కాలిపోవడం ఎలాంటి అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. వత్తి పూర్తిగా కాలిపోవడం, దీపం మధ్యలోనే ఆగిపోవడం అనేవి భౌతిక కారణాల వల్ల మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ‘వీటికి దైవిక దోషాలు, ఎలాంటి అశుభ కారణాలు లేవు. దీపం ఎప్పుడూ సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. కాబట్టి ఈ పరిణామాల వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. భయపడవలసిన అవసరం లేదు’ అని వివరిస్తున్నారు.


