News April 24, 2025

ఇది భారత్‌పై దాడి: ప్రధాని మోదీ

image

పహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడిని భారత్‌పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.

Similar News

News April 24, 2025

పోలీసుల ట్రాప్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా‌?

image

మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా‌ను భద్రతా బలగాలు ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత జరుగుతోంది. ఈ క్రమంలో హిడ్మాను ట్రాప్ చేసిన పోలీసులు అతడిని సజీవంగా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరువైపులా జరిగిన భీకర దాడుల్లో ఆరుగురు నక్సల్స్ మృతిచెందారు. హిడ్మా ఆచూకీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

News April 24, 2025

టామ్ చాకోపై మరో నటి ఆరోపణలు!

image

మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై మరో నటి అపర్ణ జాన్ ఆరోపణలు చేశారు. ‘సూత్రవాక్యం’ మూవీ షూటింగ్‌లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. AUSలో ఉన్న ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. <<16115833>>గతంలో విన్సీ<<>> చెప్పినవి 100% నిజమని పేర్కొన్నారు. తరచూ ఏదో తెల్లటి పౌడర్ నమిలేవాడని, గ్లూకోజ్ అని భావించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఇదే సినిమా సెట్‌లో తనతో అనుచితంగా ప్రవర్తించాడని విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

News April 24, 2025

గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మాధవ్ సహా ఆరుగురు నిందితులను రాజమండ్రి జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు.

error: Content is protected !!