News April 8, 2024
ఇదీ ఓ ఇండస్ట్రీ ‘కలెక్షన్ల’ రికార్డే!

హిందీ ‘ఛత్రపతి’ హీరోయిన్ నుష్రత్ ఇండస్ట్రీలో ఓ అరుదైన అనధికార రికార్డు సృష్టించారు. అది బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డు కాదు.. చెప్పుల కలెక్షన్లలో రికార్డు. ఆమెకు ఫుట్‌వేర్ కలెక్షన్ అంటే ఇష్టమట. షాపులో చెప్పులైనా, షూస్ అయినా తనకు నచ్చితే వెంటనే అవి తన ఇంట్లో ఉండాల్సిందే. అలా.. ఇప్పుడు ఆమె ఇంట్లో దాదాపు ఓ చెప్పుల దుకాణం పెట్టడానికి సరిపడినన్ని చెప్పులు ఉన్నాయి.
Similar News
News January 5, 2026
మళ్లీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాల కారణంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌పై కోపంతో మస్క్ ఒక పార్టీని కూడా ప్రకటించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. గత రాత్రి ట్రంప్, అతని భార్యతో కలిసి డిన్నర్ చేసినట్లు మస్క్ ఓ ఫొటో రిలీజ్ చేశారు. ‘2026 అద్భుతంగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 5, 2026
శివ మానస పూజ చేద్దామా?

మూర్తి పూజ కన్నా మానస పూజ ఎన్నో రెట్లు శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘నా ఆత్మయే శివుడు. నా శరీరమే ఆలయం’ అనే భావనతో శివ మానస పూజ చేస్తారు. బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా మదిలోనే శివుడిని ఆరాధించే ఈ ప్రక్రియను ఆదిశంకరాచార్యులు రచించారు. ఈ పూజతో మనసులో చింతలు తొలగుతాయని, శివసాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెబుతారు. శివ మానస పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 5, 2026
వరి నారుమడిలో జింకు లోపం నివారణ

పెరిగిన చలి కారణంగా ఇప్పటికే పోసిన వరి నారుమళ్లకు జింక్ ధాతువు లభ్యత తగ్గుతుంది. నారుమడిలో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. అలాగే వరి నారుమడికి పది గ్రాముల 19:19:19 పోషకాన్ని, 2.5 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ మిశ్రమాన్నిలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


