News August 30, 2025
ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు: CM

AP: కుప్పానికి కృష్ణమ్మను తీసుకొచ్చేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పారు. 738 కి.మీ. దూరం నుంచి కృష్ణమ్మ కుప్పానికి రావడంతో ప్రజల్లో ఆనందం చూసి ఎంతో సంతోషం కలిగిందన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇదో మరిచిపోలేని రోజని తెలిపారు.
Similar News
News August 31, 2025
విద్యార్థులకు రాగిజావ.. 40% ఖర్చు భరించనున్న ప్రభుత్వం!

TG: సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వారానికి 3 రోజులపాటు రాగిజావను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అయ్యే ఖర్చులో 40% భరించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. మిగతా ఖర్చును శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు భరిస్తుంది. ట్రస్టుతో కలిసి గత రెండేళ్లుగా ప్రభుత్వం రాగిజావను అందిస్తోండగా, ఈ ఏడాది ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మళ్లీ రాగిజావ పంపిణీ ప్రారంభం కానుంది.
News August 31, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220గా ఉంది. గుంటూరు, చిత్తూరులో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.200-220, వరంగల్‌లో రూ.210, ఖమ్మం, నల్గొండలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. కేజీ మటన్ ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉంది. మీ ఏరియాలో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
News August 31, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు <<17568780>>సన్నాహకాలు<<>> మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా, మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో? డబ్బులు రాకపోతే నిర్మాణమెలా? అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.