News January 16, 2025
ఆసియన్ గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే: స్పోర్ట్స్‌కీడా

ఆసియాలో 21వ శతాబ్దపు టెస్టు క్రికెట్‌లో గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే అంటూ ‘స్పోర్ట్స్ కీడా’ ఓ టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు జయవర్ధనే కెప్టెన్‌గా ఉన్నారు. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, సచిన్ టెండూల్కర్, సంగక్కర, అశ్విన్, రంగనా హెరాత్, షోయబ్ అక్తర్, జస్ప్రిత్ బుమ్రా, ముత్తయ్య మురళీధరన్, కోహ్లీని 12వ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. టెస్టు క్రికెట్‌లో మీ టీమ్-11 ఎవరో కామెంట్ చేయండి.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


