News May 3, 2024
నేడు సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ ఇదే..

AP: వైసీపీ చీఫ్, సీఎం జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు నరసాపురంలో ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం 3 గంటలకు కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
Similar News
News March 4, 2026
మురికివాడలో టూరిజం.. 2 గం.కు రూ.15,000!

ముంబైలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ‘ధారవి’ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. వింతగా అనిపించినా.. ఇక్కడి జీవనశైలిని, కుటీర పరిశ్రమలను చూపించేందుకు గైడ్లు ఒక్కో వ్యక్తి నుంచి 2 గంటలకు రూ.15,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశీయులు ఈ ‘స్లమ్ టూరిజం’పై ఆసక్తి చూపుతున్నారట. పేదరికాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
News March 4, 2026
భార్యతో విడాకులు.. రూ.250కోట్లు ఆఫర్ చేసిన హీరో విజయ్?

తమిళ నటుడు, TVK అధినేత విజయ్ తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. కోర్టు మెట్లు ఎక్కకుండా విజయ్ తన భార్యకు రూ.250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తన భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఈ భారీ మొత్తాన్ని ఆయన ఆఫర్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ వ్యక్తిగత విషయాన్ని గోప్యంగా ఉంచాలని విజయ్ నిర్ణయించారని వార్తలొస్తున్నాయి.
News March 4, 2026
UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో 8 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(అకౌంట్స్, పర్చేజ్ &స్టోర్స్, ఫిజిక్స్), డిప్లొమా, ITI, ఇంటర్, టెన్త్, ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 13వరకు పంపాలి. వెబ్‌సైట్: https://csr.res.in/


