News September 20, 2025

అదృష్టం అంటే ఈమెదే!

image

MP మహిళ గోల్డర్‌ను అదృష్టం వరించింది. పన్నా జిల్లాలో మైనింగ్ చేసే ఆమెకు 8 వజ్రాలు దొరికాయి. వీటిని జిల్లా డైమండ్ ఆఫీస్‌లో జమ చేయగా త్వరలో వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వజ్రాల్లో అతిపెద్దది 0.79 క్యారెట్ల బరువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వజ్రం విలువ రూ.4-6 లక్షలు పలకొచ్చన్నారు. వజ్రాల గనులకు పన్నా జిల్లా ఫేమస్. ఇక్కడ 8మీ. మైనింగ్ ప్లాట్‌ను ఏడాదికి రూ.200 చొప్పున లీజుకు ఇస్తారు.

Similar News

News September 20, 2025

RRB పరీక్ష తేదీ ఖరారు

image

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు(RRB) వివిధ జోన్లలో మొత్తం 11,558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. OCT​ 13న CBT-2 పరీక్ష నిర్వహించనున్నట్లు RRB ప్రకటించింది. పరీక్షకు 4 రోజుల ముందు <>www.rrbapply.gov.in<<>>లో కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్​ ద్వారా టికెట్​ సూపర్​వైజర్​, స్టేషన్​ మాస్టర్​, గూడ్స్​ ట్రైన్​ మేనేజర్​, సీనియర్​ క్లర్క్​, టైపిస్టు పోస్టులను భర్తీ చేయనుంది.

News September 20, 2025

ఒకే ఏడాదిలో 34 సినిమాలు@ మోహన్‌లాల్

image

నటుడు <<17774717>>మోహన్ లాల్‌<<>>కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన 1978లో ‘తిరనోట్టం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 1986లో ఏకంగా 34 సినిమాల్లో నటించారు. నిర్మాత, గాయకుడిగానూ గుర్తింపు పొందారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి. 2 సార్లు జాతీయ, 9 సార్లు కేరళ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం ఆయన నటనకు దాసోహమయ్యాయి.

News September 20, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* రూ.25.30 కోట్ల విలువజేసే 1858 కిలోల డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు
* రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రులలో లేదా అనుబంధంగా ఉన్న 115 ఫార్మసీల్లో అవకతవకలపై షోకాజ్ నోటీసులు జారీ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
* ఈ నెలలో అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం.
* ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్