News August 23, 2025

రింకూ-ప్రియ మధ్య ప్రేమ మొదలైంది ఇలానే!

image

ప్రియా సరోజ్‌తో ప్రేమ ఎలా మొదలైందో స్టార్ క్రికెటర్ రింకూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘2022లో ముంబైలో IPL మ్యాచ్ జరిగినప్పుడు SMలో <<16639641>>ప్రియ<<>> ఫొటోను చూసి తనే నాకు సరైన భాగస్వామి అనుకున్నా. కానీ ఆమెకు ఆ విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు. కొన్ని రోజులకు ఇన్‌స్టాలో ఆమె నా ఫొటోలకు లైక్ చేయడంతో మెసేజ్ చేశా. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడుతున్నా. అలా ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు.

Similar News

News March 24, 2026

‘ధురంధర్-2’ బ్యాన్ చేయాలని కోర్టుకు..

image

ధురంధర్-2 సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టును మౌఖికంగా కోరినట్లు Live Law వెల్లడించింది. ‘ఈ చిత్రంలో రాజకీయ అంశాలున్నాయి. TN ఎన్నికల వేళ ఈ సినిమాను ప్రదర్శించకూడదు’ అని పేర్కొన్నట్లు తెలిపింది. అయితే చిత్రంపై అభ్యంతరం ఉంటే ముందుగా రిట్ పిటిషన్‌ దాఖలు చేసి, ఆ తర్వాత అత్యవసర విచారణ కోరాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News March 24, 2026

భద్రాద్రి రాముడిపై వివాదం.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

image

TG: భద్రాద్రి రామయ్య గోత్ర నామాల <<19454045>>వివాదంపై<<>> దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికనూ పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆ తర్వాతే ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. రాజ్యాంగంలోని 25, 26 అధికరణ ప్రకారం పూజా విధానాల్లో మార్పులకు వీల్లేదని పిటిషనర్లు చెప్పారు. ఇరుపక్షాల వాదన నిమిత్తం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

News March 24, 2026

రైతులకు రుణమాఫీ ప్రతిపాదన లేదు: కేంద్రం

image

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద రైతు రుణమాఫీ చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రుణమాఫీ కంటే కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే సాయం, PM కిసాన్ నిధులు, తక్కువ వడ్డీకే లోన్లు అందించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పూచీకత్తు లేని లోన్ల పరిమితిని ₹2 లక్షలకు పెంచామని వివరించారు.