News August 12, 2024

శ్రావణ సోమవారం శివయ్యను ఇలా పూజించాలి

image

శ్రావణమాసంలో శివపార్వతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో వారు భూమిపై నివసించి భక్తులపై ఆశీర్వాదాలు కురిపిస్తారని నమ్ముతారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు. ఇవాళ నీలకంఠుడిని పూజించడం ద్వారా శత్రు భయాలు, పనుల్లో ఆటంకాలు, తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతుందని చెబుతారు. చెరుకు రసంతో అభిషేకం చేసి ‘ఓం నమో నీలకంఠాయనమ:’ అనే మంత్రాన్ని జపించాలి.

Similar News

News January 23, 2025

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మదగజరాజా’

image

విశాల్‌ నటించిన ‘మదగజరాజా’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సత్యకృష్ణన్‌ ప్రొడక్షన్‌ సిద్ధమైంది. సంక్రాంతికి తమిళనాట రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌ ప్రేక్షకులను అలరిస్తోందని మూవీ టీం తెలిపింది. 12ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో ఇంతకాలం విడుదల కాలేదు.

News January 23, 2025

రేపటి నుంచి విశాఖలో ABVP రాష్ట్ర మహాసభలు

image

AP: విశాఖలో రేపటి నుంచి ABVP రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. AU ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. 25న ఏబీవీపీ కార్యకర్తలతో శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. సంస్థ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా త్వరలో ‘పంచ పరివర్తన్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర తెలిపారు.

News January 23, 2025

ఆ పోస్టులకు మార్చి 2న రాత పరీక్ష

image

AP: జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్చి 2న రాత పరీక్ష నిర్వహించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. గతంలో నిర్వహించిన డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించిన 311 మందికి నెల్లూరు జిల్లా మూలపేటలోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్(APSTARS) పాత సెంట్రల్ జైలు ఆవరణలో పరీక్ష నిర్వహించనుంది. MLV అభ్యర్థులు ఉదయం 8గంటలకు, HMV అభ్యర్థులు మధ్యాహ్నం 12గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.