News January 7, 2025
చైనా వైరస్.. వ్యాపించేది ఇలా

దేశంలో hMPV కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ వైరస్ సోకినవారు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ప్రభావం ఎక్కువ. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3-6 రోజుల తర్వాత లక్షణాలు(జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం) కన్పిస్తాయి.
Similar News
News November 5, 2025
పిల్లల ముందు ఆ పనులు వద్దు!

పేరెంట్స్ ఏది చేస్తే చిన్న పిల్లలు వాటినే అనుకరిస్తారు. కొంతమంది భార్యాభర్తలు కిడ్స్ ముందే రొమాన్స్ చేస్తుంటారు. అది వారి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే పిల్లల ముందు ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం వల్ల వాళ్లూ అలాగే తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక చిన్నారుల ముందు మందు తాగడం, సిగరెట్లు కాల్చడం వల్ల వారూ చెడు అలవాట్లకు గురయ్యే ఆస్కారం ఉంది. Share It
News November 5, 2025
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన అమెరికా

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘Minuteman-III’ను అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. అణు సామర్థ్యం గల ఈ మిసైల్ 6,760 KM ప్రయాణించి మార్షల్ ఐలాండ్స్లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్లో ల్యాండ్ అయింది. న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ తిరిగి ప్రారంభిస్తామని ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం.
News November 5, 2025
కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.


