News January 11, 2025
APలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విభజన ఇలా

మల్టీపర్పస్ ఫంక్షనరీస్- పంచాయతీ సెక్రటరీ, డిజిటల్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, వార్డు అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి
టెక్నికల్ ఫంక్షనరీస్- VRO, ANM, సర్వే, ఎనర్జీ, ఇంజినీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్, వెటర్నరీ సెక్రటరీ, రెవెన్యూ, వార్డు హెల్త్, ప్లానింగ్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, శానిటేషన్, ఎనర్జీ సెక్రటరీ
Similar News
News December 10, 2025
పురుగు మందులు.. రైతులకు సూచనలు

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్ల నాజిల్స్లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.
News December 10, 2025
మొదలైన లారీల బంద్

TGలో లారీల టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.
News December 10, 2025
ఎండినవారికి ఇనుము తిండి

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.


