News April 8, 2024
ముఖాన్ని ఇలా రక్షించుకోవచ్చు!

నేటి కాలుష్యం కారణంగా ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారుతోంది. అయితే, నీటితో తరచూ శుభ్రం చేసుకుంటే ముఖాన్ని రక్షించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ‘మృతకణాలు, సహజసిద్ధంగా చర్మం నుంచి వచ్చే నూనె వలన వదనం కళావిహీనం అవుతుంటుంది. రోజుకు కనీసం 2సార్లు ముఖాన్ని నీటితో కడుక్కోవడం ద్వారా ఈ సమస్యకు కొంతమేర చెక్ పెట్టొచ్చు. సుదీర్ఘకాలంలో మొటిమలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News December 9, 2025
మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
News December 9, 2025
మండలానికొక జన ఔషధి కేంద్రం: సత్యకుమార్

AP: నకిలీ, నిషేధిత మందులు మార్కెట్లోకి రాకుండా నిఘా పెట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ‘ఇటీవల 158 షాపుల్ని తనిఖీ చేస్తే 148కి సరైన అనుమతులు లేవు. సిబ్బంది అక్రమాలను ఉపేక్షించేది లేదు. అవసరమైన సిబ్బందిని APPSC ద్వారా కాకుండా MSRBతో నియమిస్తాం’ అని పేర్కొన్నారు. మండలానికొక జన ఔషధి కేంద్రం ఏర్పాటు యోచన ఉందన్నారు. 11 డ్రగ్ కంట్రోల్, 2 ల్యాబ్ భవనాల్ని మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
News December 9, 2025
పిల్లల ఎదుట గొడవ పడుతున్నారా?

తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే అది పిల్లల్లో భయం, ఆందోళనకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి వారి మానసిక ఆరోగ్యం, చదువు, నిద్ర, సామాజిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. అలాగే పెద్దలను అనుకరించే పిల్లలు అదే ప్రవర్తనను తమ జీవితంలో అలవర్చుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు విభేదాలను శాంతంగా పరిష్కరించుకోవాలి.


