News August 21, 2025
ఇలా చేసి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!

రోజుకు కనీసం 2.5-3లీటర్ల నీటిని తాగితే కిడ్నీల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఉప్పు, ప్రాసెస్డ్&ఆయిల్ ఫుడ్, మాంసాహారాన్ని పరిమితం చేయాలి. సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించాలి. వ్యాయామం, తగిన నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం. మూత్ర విసర్జన ఆపుకోకూడదు. శరీర బరువు పెరిగితే బీపీ, షుగర్ వచ్చే అవకాశముంది. ఈ రెండూ కిడ్నీల డ్యామేజ్‌కు ప్రధాన కారణాలు’ అని చెబుతున్నారు. SHARE IT.
Similar News
News August 21, 2025
ZPTC ఉపఎన్నికల విజేతలను అభినందించిన చంద్రబాబు

AP: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి, కృష్ణారెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉమ్మడి కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. నేతలంతా కలిసి పనిచేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుని గెలిపించారని చంద్రబాబు ప్రశంసించారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు.
News August 21, 2025
ఫేక్ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు!

TG: పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో నకిలీ సర్టిఫికెట్లతో 50 మందికి పైగా సెలక్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. 2022 నోటిఫికేషన్‌లో HYD పరిధిలో స్థానికతను చూపించేందుకు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. మొత్తం 59 మందిలో 54 మంది సెలక్ట్ అయ్యారని, వారిపై సీసీఎస్‌లో కేసు నమోదు చేశామన్నారు. అభ్యర్థుల ప్రొబెషన్‌ను నిలిపివేసి, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
News August 21, 2025
బాంబ్ సందేశం తెచ్చిన పావురం.. జమ్మూలో హైఅలర్ట్

భారత్-పాక్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో ఓ పావురం కలకలం రేపింది. దాని కాలికి రానున్న రోజుల్లో ‘జమ్మూ స్టేషన్‌ను ఐఈడీతో బ్లాస్ట్ చేస్తాం’ అని రాసి ఉండటాన్ని BSF బలగాలు గుర్తించాయి. అలాగే ‘కశ్మీర్ మాది’ అనే స్లోగన్ సైతం ఉండటంతో జమ్మూలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. జమ్మూ రైల్వే స్టేషన్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి.