News February 17, 2025

గురకను ఇలా తగ్గించుకోవచ్చు!

image

మనకు తెలియకుండా మన పక్కన ఉండేవారిని వేధించే మన సమస్య గురక. చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుందని స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్ సంస్థ వైద్యులు చెబుతున్నారు. ‘వెల్లకిల్లా కాకుండా పక్కకి తిరిగి పడుకోవడం, ధూమ, మద్యపానాలు మానేయడం, ఊబకాయులైతే బరువు తగ్గడం గురకను కొంతమేర తగ్గించడంలో ఉపకరిస్తాయి. అరుదైన కేసుల్లో మాత్రం సర్జరీ అవసరం పడుతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

వంటింటి చిట్కాలు

image

– బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
– బాగా పండిన టమాటాలను ఉప్పు నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికి తాజాగా ఉంటాయి.
– కాకరకాయ కూరలో సొంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
– ఫర్నిచర్, వంట పాత్రలపై ఉండే స్టిక్కర్లను ఈజీగా తీయడానికి దాని మీద నూనె వేసి రుద్ది, పావుగంటయ్యాక సబ్బుతో కడిగితే సరిపోతుంది.

News October 22, 2025

రౌడీ చనిపోతే మానవహక్కులు గుర్తుకొస్తాయా?.. VHP ఫైర్

image

TG: NZBలో కానిస్టేబుల్‌ను చంపిన రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ ఫైరైంది. ‘పోలీసులు మరణిస్తే లేని మానవహక్కులు ఓ రౌడీ చనిపోతే గుర్తుకొస్తాయా? నేరస్థులకు మరింత ప్రోత్సాహమిచ్చేలా మాట్లాడటం హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లే అవుతుంది’ అని మండిపడింది. జిహాదీ మూకలకు ఇదే రీతిలో జవాబివ్వాలని పోలీసులను కోరింది.

News October 22, 2025

‘బీపీటీ 2846’ వరి రకం ప్రత్యేకత ఏమిటి?

image

ఇది అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్నగింజ రకం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఇది భోజనానికి అనుకూలంగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి వస్తుంది. సేంద్రియ వ్యవసాయం, నేరుగా విత్తే విధానాలకు BPT 2846 వరి రకం అనుకూలం.