News September 12, 2025
వేప మందులను ఇలా వాడితే ఎక్కువ లాభం

పంటల్లో వేపనూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు హానిచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.
Similar News
News September 12, 2025
PHOTOS: వే2న్యూస్ కాన్‌క్లేవ్-2025

AP: నేడు మంగళగిరిలో నిర్వహించిన Way2News కాన్‌క్లేవ్-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడులు, మెడికల్ కాలేజీలు ఇలా అనేక అంశాలపై తన విజన్‌ను వివరించారు. అటు వైసీపీ నుంచి సజ్జల, బుగ్గన తమ పాలనలో చేసిన పనులు, ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫొటోస్‌ను పై గ్యాలరీలో చూడొచ్చు.
News September 12, 2025
రాజకీయాల్లోకి వెళ్లను: బ్రహ్మానందం

తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని కమెడియన్ బ్రహ్మానందం అన్నారు. ఆయన ఆత్మకథ ‘నేను మీ బ్రహ్మానందం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. బ్రహ్మానందం 30ఏళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని వెంకయ్య కొనియాడారు. తన జీవితం గురించి ఈ బుక్‌లో రాశానని బ్రహ్మానందం తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చానని, లెక్చరర్‌గా పనిచేశానని చెప్పారు.
News September 12, 2025
వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ టైమ్ విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది. 2&3 వీలర్స్, బస్సులు, ట్రాక్టర్లు, ట్రెయిలర్లు, కన్‌స్ట్రక్షన్, గూడ్స్ తదితర అన్ని రకాల వెహికల్స్ కచ్చితంగా వీటిని అమర్చుకోవాలని ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.