News October 23, 2025
మొక్కజొన్న కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు

మొక్కజొన్న కంకి మొక్కకే ఉండి త్వరగా ఎండిపోవడానికి కొందరు రైతులు వినూత్న విధానం అనుసరిస్తున్నారు. మొక్కకు కంకి ఉండగానే.. ఆ మొక్క కర్రకు ఉన్న ఆకులు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఇలా కత్తిరించిన ఆకులను పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. దీని వల్ల కంకి త్వరగా ఎండిపోవడంతో పాటు నేల కూడా త్వరగా ఆరుతోందని చెబుతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు మొక్కజొన్న రైతులు ఈ విధానం అనుసరిస్తున్నారు.
Similar News
News October 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 44 సమాధానాలు

1. భరతుని మేనమామ ‘యధాజిత్తు’.
2. ఉత్తరుడు మత్స్య దేశపు రాజు అయిన విరాటరాజు, సుధేష్ణల కుమారుడు.
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ‘సత్య లోకం’.
4. గరుడ పక్షి విష్ణువు వాహనం.
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 23, 2025
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు క్యాబినెట్ ఆమోదం

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించగా తాజాగా సీఎం అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ధ్రువీకరించారు.
News October 23, 2025
మిస్సింగ్ ఉద్యోగులు.. రంగంలోకి ఇంటెలిజెన్స్

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యలో అవకతవకలపై ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలైందని విశ్వసనీయ సమాచారం. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎంతమంది, ఎంతకాలంగా పని చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల వివరాలు సేకరించగా.. 1.03 లక్షల మంది సమాచారం లేదు. కానీ, వీరి పేరిట పదేళ్లుగా నెలకు రూ.150కోట్ల జీతాలు జమ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది.