News March 18, 2025

అంతరిక్షంలో ఇలానే పడుకుంటారు!

image

వ్యోమగాములు సునీతా, విల్మోర్‌ ISS నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలో వారు ఎలా నిద్రపోయారనే సందేహం చాలా మందిలో నెలకొంది. దీనికోసం అక్కడ చేసిన ఏర్పాట్లను NASA తెలియజేసింది. అక్కడ వ్యోమగాములు స్లీపింగ్ బ్యాగుల్లో తమ శరీరాలను ఉంచి నిద్రిస్తారు. వారికి దగ్గర్లోనే కంప్యూటర్ హెడ్‌ఫోన్, ల్యాప్‌టాప్, వ్యక్తిగత వస్తువులు ఉంచుకునేలా ఏర్పాటు చేశారు.

Similar News

News October 18, 2025

బ్రిటన్‌లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

image

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్‌ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్‌ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.

News October 18, 2025

భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు వర్షం ముప్పు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనుండటంతో రేపు పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆక్యూవెదర్ ప్రకారం ఈ మ్యాచుకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం వల్ల టాస్ ఆలస్యమయ్యే ఛాన్సుందని, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 35% పెరగొచ్చని అంచనా.

News October 18, 2025

‘మలబార్’కు పాక్ ఇన్‌ఫ్లూయెన్సర్ కష్టాలు

image

ధంతేరాస్ వేళ మలబార్ గోల్డ్&డైమండ్స్‌ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ కంపెనీ లండన్‌లో తమ షోరూమ్ ఓపెనింగ్‌కు UK బేస్డ్ పాక్ ఇన్‌ఫ్లూయెన్సర్ అలిష్బా ఖాలీద్‌తో కొలాబరేట్ కావడమే అందుక్కారణం. గతంలో ఆమె Op సిందూర్‌ను ‘పిరికి చర్య’గా అభివర్ణించారు. దీంతో మలబార్ యాజమాన్యం పాక్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తోందని నెటిజన్లు SMలో పోస్టులు పెట్టారు. సంస్థ బాంబే కోర్టుకెళ్లగా అలాంటి పోస్టులు తొలగించాలని ఆదేశించింది.