News December 24, 2024
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్ దశలో భారత్ మొత్తం 3 మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్లో జరుగుతాయి. మార్చి 4న సెమీఫైనల్-1, 5న సెమీఫైనల్-2, 9న ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. భారత్ ఫైనల్కు చేరితే ఈ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. లేదంటే లాహోర్లో నిర్వహిస్తారు.
Similar News
News December 25, 2024
కొత్త ఏడాదిలో మీ రిజల్యూషన్ ఏంటి?
నూతన సంవత్సరం అనగానే కొత్త మార్పులను చాలా మంది కోరుకుంటారు. డబ్బులు ఆదా చేయడం, స్మోకింగ్, మద్యం మానేయడం, జిమ్కి వెళ్లడం, డైటింగ్, స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త ప్రయాణాలు చేయడం వంటి రిజల్యూషన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి కొత్త ఏడాదిలో మీరు ఎలాంటి రిజల్యూషన్ తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి.
News December 25, 2024
టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం
AP: పదో తరగతి విద్యార్థులకు SSC పరీక్షల విభాగం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారికోసం తత్కాల్ విధానం తీసుకొచ్చింది. ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్లో రూ.1000 ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.శ్రీనివాసులురెడ్డి సూచించారు.
News December 25, 2024
ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదు.. హైకోర్టులో అంబటి పిటిషన్
AP: వైఎస్ జగన్తో పాటు తన కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు తనకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ రేపు/ఎల్లుండి విచారణకు రానుంది. పార్టీ ఇన్పర్సన్గా రాంబాబు స్వయంగా వాదనలు వినిపించనున్నారు.