News January 5, 2025
WTC 2025-27లో భారత షెడ్యూల్ ఇదే
ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో BGT సిరీస్ ఓడిన టీమ్ ఇండియా తర్వాతి టెస్ట్ మ్యాచును ఈ ఏడాది జూన్‌లో ఆడనుంది. WTC 2025-27లో భాగంగా జూన్-ఆగస్టు మధ్య ఇంగ్లండ్‌తో 5 టెస్టులు, అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో 2, నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికాతో 2, 2026 ఆగస్టులో శ్రీలంకతో 2, 2026 అక్టోబర్, నవంబర్‌లో NZతో 2, 2027 జనవరి, ఫిబ్రవరిలో AUSతో 5 టెస్టులు (BGT సిరీస్) ఆడనుంది.
Similar News
News January 7, 2025
KTR అరెస్ట్ తప్పదా? ఈనెల 9న ఏం జరగనుంది?
TG: ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి ఏసీబీ కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. మరోవైపు ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా?ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తారా? అనేది జనాల్లో చర్చనీయాంశంగా మారింది.
News January 7, 2025
ఆస్కార్ బరిలో ‘కంగువా’, ‘ది గోట్ లైఫ్’
తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ 2025 పోటీలో నిలిచిన సినిమాల లిస్ట్ రిలీజవగా ఇందులో ‘కంగువా’ చోటు దక్కించుకుంది. దీంతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ కూడా ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు.
News January 7, 2025
కోటి ఎకరాలకు ‘రైతు భరోసా’?
TG: ఈనెల 26 నుంచి ‘రైతు భరోసా’ సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి ₹6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే ₹5,500 కోట్ల నుంచి ₹6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.