News August 23, 2024
యుద్ధంపై కమల హారిస్ అభిప్రాయం ఇదే
ఇజ్రాయెల్‌కి తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, దానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తానని డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పష్టం చేశారు. అదే సమయంలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడం అవసరమని చెప్పారు. ‘గాజాలో గత 10 నెలలుగా జరుగుతున్నది దారుణం. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆకలితో అలమటిస్తూ రక్షణకై తరలిపోతున్న ప్రజల బాధలు హృదయవిదారకం’ అని అన్నారు.
Similar News
News January 27, 2025
ట్రంప్ 2.0: ప్రపంచ శాంతికి మేలేనన్న భారతీయులు
అమెరికా ప్రెసిడెంటుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికవ్వడంపై మెజారిటీ భారతీయులు సానుకూలంగా ఉన్నారని ECFR సర్వే పేర్కొంది. ‘Trump Welcomers’ కేటగిరీలో వారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఆయన గెలుపు ప్రపంచ శాంతికి మేలని 82, భారత్‌కు మంచిదని 84, US పౌరులకు మంచిదని 85% భారతీయులు అన్నారు. చైనా, తుర్కియే, బ్రెజిల్ పౌరులూ ఇలాగే భావిస్తున్నారు. EU, UK, AUSలో ఎక్కువగా ‘Never Trumpers’ కేటగిరీలో ఉన్నారు.
News January 27, 2025
TTD Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భక్తులకు సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారిని నిన్న 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,466 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్ల ఆదాయం హుండీకి సమకూరినట్లు అధికారులు తెలిపారు.
News January 27, 2025
మాట విన్లేదు.. ప్రతీకారంతో టారిఫ్స్ పెంచేసిన ట్రంప్
కొలంబియాపై డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపించారు. అక్రమ వలసదారులను తీసుకెళ్లిన 2 విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారంగా 25% టారిఫ్స్ పెంచేశారు. ఆ దేశ పౌరులపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించారు. వారి మద్దతుదారులు సహా అధికారుల వీసాలను రద్దు చేశారు. ‘కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రోకు మంచిపేరు లేదు. విమానాలను అడ్డుకొని US భద్రతను ఆయన సందిగ్ధంలో పడేశారు’ అని అన్నారు.