News October 9, 2025

కరీనాకపూర్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

image

బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఏజ్ పెరిగేకొద్దీ యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరుపిల్లల తల్లైనా ఫిట్‌గా ఉండటానికి కారణం హెల్తీ లైఫ్‌స్టైలేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. రోజూ సాయంత్రం 6 లోపు డిన్నర్ చేసి 9.30కి నిద్రపోతానని తెలిపారు. నైట్ పార్టీలకు దూరంగా ఉంటానని, రెగ్యులర్ వర్కవుట్స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తానని పేర్కొన్నారు. పరాఠా, కిచిడీ ఇష్టమైన ఫుడ్స్ అని తెలిపారు.<<-se>>#celebrity<<>>

Similar News

News October 9, 2025

దేశంలో నం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

image

దేశంలో టాప్-100 కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సంపద 105బి. డాలర్లుగా ఉండగా గత ఏడాదితో పోలిస్తే 12శాతం తగ్గింది. రెండో స్థానంలో 92బి. డాలర్ల ఆదాయంతో గౌతమ్ ఆదానీ ఉన్నారు. సావిత్రి జిందాల్(ఓపీ జిందాల్ గ్రూప్), టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

News October 9, 2025

భైరవుడి ఆవిర్భావం: శివుని శక్తి స్వరూపం

image

సత్యానికి విరుద్ధంగా మాట్లాడిన బ్రహ్మ దర్పాన్ని అణచడానికి, మహాదేవుడు తన నుదుటి మధ్య నుంచి భైరవుడిని సృష్టించాడు. తాను ఎవరో, తన కర్తవ్యం ఏంటో భైరవుడు అడగ్గా.. శివుడు ఇలా వివరించాడు. ‘భ’ అంటే భరణం(పోషించడం), ‘ర’ అంటే రవణం(నాశనం చేయడం), ‘వ’ అంటే వమనం(సృష్టించడం). సృష్టి, స్థితి, లయ కారకుడివి నువ్వే కనుక నీవు భైరవుడివి అని నామకరణం చేశాడు. శివుని సంపూర్ణ శక్తి స్వరూపమే భైరవుడు. <<-se>>#SIVOHAM<<>>

News October 9, 2025

గడువులోపు ఆమోదం తెలపకపోతే చట్టంగా భావిస్తాం: ఏజీ

image

TG: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణలో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తోంది. ఈ బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపినా ఆమోదం తెలపలేదని AG సుదర్శన్ రెడ్డి HCకి గుర్తు చేశారు. దీంతో తమిళనాడు కేసును ఉదాహరణగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ బిల్లు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేశారు. గవర్నర్/రాష్ట్రపతి గడువులోపు బిల్లును ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందన్నారు.