News April 1, 2024
తిహార్ జైలులో కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఇదే!

తిహార్ జైలులో కేజ్రీవాల్‌కు రెండో నంబర్ గదిని కేటాయించారు. ఆయన డైలీ రొటీన్ ఉ.6:30కు ప్రారంభమవుతుంది. బ్రేక్ ఫాస్ట్‌లో టీ, బ్రెడ్ ఇస్తారు. కోర్టు విచారణ ఉంటే తీసుకెళ్తారు. లేదంటే ఆయన తన లాయర్లతో భేటీ కావొచ్చు. ఉ.10:30-11 మధ్య పప్పు, కర్రీ, 5 రొట్టెలు భోజనంగా ఇస్తారు. మ.3:30కి టీ, బిస్కట్లు ఇస్తారు. సా.4కి లాయర్లను మీట్ అవ్వొచ్చు. సా.5:30కి డిన్నర్ ఉంటుంది. రాత్రి 7కల్లా మళ్లీ సెల్‌కి పంపిస్తారు.
Similar News
News February 19, 2026
ఏ రాశివారు ఎన్ని వత్తుల దీపం వెలిగించాలంటే?

మేష రాశి – త్రివత్తులు(3), వృషభ రాశి – చతుర్‌వత్తులు (4), మిథున రాశి – సప్తమవత్తులు (7), కర్కాటక రాశి – త్రివత్తులు(3), సింహ రాశి – పంచమవత్తులు (5), కన్య రాశి – చతుర్‌వత్తులు (4), తులా రాశి – షణ్ముఖ వత్తులు (6), వృశ్చిక రాశి – పంచమవత్తులు (5), ధనుస్సు రాశి – త్రివత్తులు(3), మకర రాశి – సప్తమవత్తులు (7), కుంభ రాశి – చతుర్‌వత్తులు (4), మీన రాశి – పంచమవత్తులు (5).
News February 19, 2026
1399 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

IOCLకు చెందిన వివిధ రిఫైనరీలలో 1399 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పానిపట్ రిఫైనరీలో 637, మథుర రిఫైనరీలో 108, బొంగైగావ్ రిఫైనరీలో 88, గుజరాత్ రిఫైనరీలో 566 పోస్టులు ఉన్నాయి. BSc/BA/B.Com, టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా అర్హత గల వారు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18-24ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com
News February 19, 2026
అరటి సాగుకు మేలైన రకాలు

అరటి ఉత్పత్తిలో దేశంలోనే AP తొలిస్థానంలో ఉంది. ఈ పంట సాగుకు సారవంతమైన తగిన నీటి వసతి కలిగిన భూమి అనుకూలం. అలాగే నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగిన సేంద్రియ పదార్థము గల నేలలు అనుకూలం. పండ్ల కోసం కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, గ్రాండ్‌నైన్, పొట్టి పచ్చ అరటి.. కూర కోసం కొవ్వూరు బొంత, గోదావరి బొంత రకాలు అనుకూలం. తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, బొంత రకాలను ఏడాది పొడవునా నాటవచ్చు.


